చేయి చేయి కలిపి సాగితే... ఎంతటి లక్ష్యాన్నైనా అందుకోగలం. బృందంగా ఏర్పడి కలిసికట్టుగా కృషి చేస్తే ఏదైనా సాధించగలం. ఇదే ఐకమత్యంలో ఉన్న బలం. ఆ పరస్పర సహకార స్ఫూర్తిని మొక్కల పెంపకంలో చూపి... సహజ ఇంటి పంటల వనానికి రూపునిచ్చారు.... హైదరాబాద్ సనత్ నగర్ లోని లోధా కాసా పారడిసో నివాస సముదాయ వాసులు. కాంక్రీట్ జంగిల్ లా మారిన నగరంలో మిద్దెతోట ద్వారా స్వచ్ఛమైన కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు పొందేందుకు కలిసికట్టుగా కదిలారు. ఇళ్లలో వృధాగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు, బాటిళ్లు, డ్రమ్ములను సేకరించి.. అందమైన సొంతింటి పంటల వనాన్ని సృష్టించారు. ఇంటి పంటల ద్వారా వస్తోన్న కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లని ఫ్లాట్స్ లో వారికి ఉచితంగా అందిస్తూ... ఆరోగ్యాన్ని పంచుతున్నారు..
0 Comments